హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు సౌకర్యం కల్పించాలని ఆందోళన

NGKL: లింగాల మండలం మాడాపూర్‌ గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. దీంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ ప్రధాన రహదారి వరకు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి మాడాపూర్‌కు ప్రత్యేక బస్సు నడపాలని కోరుతున్నారు.