హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూర్యారావుపేటలో గణపతి నవరాత్రులు

KKD: నగరంలోని సూర్యారావుపేట భోగి గణపతి పీఠంలో ఈనెల 14 నుంచి గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహించనున్నట్లు పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రమణరాజు, వరలక్ష్మి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు వినాయకవ్రత పూజ, లక్ష్మీకలశ ప్రతిష్ఠ, ఆరాధకుల మాలధారణతో 9 రోజుల గణపతి నవరాత్రి దీక్షలు ప్రారంభించనున్నట్లు చెప్పారు.