భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి శాంతకుమారన్ నాయర్(89) కన్నుమూశారు. అనారోగ్యంతో కొచ్చిలోని లిసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. రిటైర్డ్ ఎల్ఐసీ జోనల్ మేనేజర్ అయిన శాంతకుమారన్ అంత్యక్రియలు ఈనెల 13న కొత్తమంగళంలో నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.
క్రీడలు
మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం


