హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పింఛన్లలో దళారుల దందా'

VSP: కొత్త పింఛన్లకు కుల, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరి చేయడంతో విశాఖలో దళారుల దందా మొదలైంది. సాధారణ దరఖాస్తుకు రోజులు పడుతుండగా మధ్యవర్తులు మాత్రం ఒక్కరోజులోనే సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారు. పింఛను కోసం పేదలు ఆశగా ఎదురుచూస్తుండగా, సర్టిఫికెట్ల జాప్యంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.