కృష్ణా: గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానం శనివారం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి గన్నవరం బయలుదేరిన విమానం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాజమండ్రికి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. విమానంలో మొత్తం 65 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..!


