హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిన వ్యాన్

EG: దేవరపల్లి(M) యర్నగూడెం గండి చెరువు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిడదవోలు(M) కోరుమామిడి నుంచి విజయవాడకు సౌండ్ సిస్టం పరికరాలను తీసుకెళ్తున్న వ్యాన్ ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమం కాగా గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.