హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో వర్షం..!

NTR: విజయవాడ నగరంలో శనివారం తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి పలుచోట్ల ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం దంచికొడుతోంది. గుణదల, మాచవరం, ప్రభుత్వాసుపత్రి, మొగల్రాజపురం, తదితర ప్రాంతాల్లో వర్షం తీవ్రంగా ఉంది. వర్షంతో రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.