SKLM: పాతపట్నంలో వెలసిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, అలంకరణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో సుఖశాంతులు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీనీలమణి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు


