హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

GNTR: రోడ్డు దాటుతున్న వ్యక్తిని స్కార్పియో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున ఫిరంగిపురం చర్చి వద్ద చోటుచేసుకుంది. గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న తెలుపు స్కార్పియో.. రోడ్డు దాటుతున్న కర్రి జోజప్ప (48)ను ఢీకొంది. తీవ్ర గాయాలతో జోజప్ప అక్కడికక్కడే మృతి చెందారు.