హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు

అన్నమయ్య: గుర్రంకొండలో శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో 70 ఏళ్ల రైతు శుభహాన్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘసముద్రానికి చెందిన ఆయన పొలం నుంచి నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా మహేంద్రని గుడి వద్ద బైక్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే గమనించి మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు.