హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలోకి దూకి యువకుడి హల్‌చల్

GNTR: తెనాలిలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి, వారి కుటుంబసభ్యులు వెంటపడడంతో పరారయ్యాడు. బస్టాండ్ సమీపంలోని సాయిబాబా గుడి వద్ద పడవల కాల్వలోకి దూకాడు. పోలీసులు చేరుకోగా ఈదుకుంటూ మార్కెట్ వంతెన సమీపానికి వెళ్లాడు. సుమారు అరగంట అనంతరం అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనలతో కాల్వలోకి దిగి బయటకు తీశారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.