హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితికి పటిష్ట భద్రతా చర్యలు: జేసీ

ELR: వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని జేసీ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి బాణాసంచా, విద్యుద్ఘాతం, నిమజ్జన ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతిలేని బాణాసంచా నిల్వలపై నిఘా పెట్టాలన్నారు.