హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త తొలగించండి.. రోగాలు అరికట్టండి..!

NTR: తాడిగడపలో పారిశుధ్ధ్య సమస్యలు స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి.పెనమలూరు పోలీస్ స్టేషన్, విలేజ్ హెల్త్ క్లినిక్ సమీపంలో చెత్త భారీగా పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.