హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు గడివేములలో విస్తృత స్థాయి సమావేశం

NDL: గడివేములలోని ఏఆర్‌ ఫంక్షన్‌ హాలులో వైసీపీ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్‌ మధుసూదన్‌ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి హాజరై పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలకు సలహాలు, సూచనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.