హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓర్వకల్లు సచివాలయంలో MLA ఆకస్మిక తనిఖీలు

KRNL: ఓర్వకల్లు గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో అందుతున్న సేవలు, కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు నమోదు చేసి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని ఆదేశించారు.