హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

KDP: ఒంటిమిట్ట కోదండరామాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ శుక్రవారం పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. రంగమండపంలో సీతారామలక్ష్మణులను పట్టువస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టమన్నును సేకరించి స్వామివారికి సమర్పించారు. అనంతరం భక్తులు జగదభిరాముడిని దర్శించుకున్నారు.