సత్యసాయి: తలుపుల(M) కొరుగుటపల్లి గ్రామ పొలిమేరలోని మామిడి తోటలో పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. ఎస్సై చెన్నయ్య సిబ్బందితో నిర్వహించిన దాడిలో ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.7,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మరికొందరు పరారయ్యారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనపై కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తలుపులలో పేకాట స్థావరంపై దాడి


