హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి నిల్వలపై ప్రత్యేక దృష్టి

VZM: ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బొబ్బిలిలోని జలమయమైన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు శుక్రవారం కమిషనర్ ఎల్. రామలక్ష్మి క్షేత్రస్థాయిలో పర్యటించి నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే సిబ్బందిని నియమించి నీటిని తొలగించాలని ఆదేశించారు. రానున్న వర్షాల దృష్ట్యా 24/7 సిబ్బందిని అందుబాటులో ఉండాలన్నారు.