హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మట్టి వినాయక ప్రతిమలనే పూజిద్దాం'

VSP: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం జీవీఎంసీ, ఏపీపీసీబీ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగులు, ప్రజలకు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పండుగ సమయంలో ప్లాస్టిక్ వాడకం తగ్గించి, వ్యర్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు.