హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించండి'

అన్నమయ్య: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించాలని పెనగలూరు మండల సీపీఐ కార్యదర్శి లక్ష్మీనారాయణ అధికారులను కోరారు. పెనగలూరు మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్న కారణంగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ కార్యదర్శులు అర్హులకు అవగాహన కల్పించాలని కోరారు.