E.G: సీతానగరం మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మేరకు జాబితాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రజలు కార్యాలయంలో ఓటర్ల జాబితాలను పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీతానగరం మండలంలో ఫోటో ఓటర్ల జాబితాలు


