హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల పరిశీలన

ELR: ఉంగుటూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 79 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో మనోజ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని గోపాలపురం గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో త్రాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, తదితర మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు.