AKP: కశింకోట మండలం జి.భీమవరం గ్రామాన్ని జడ్పీ సీఈవో నారాయణమూర్తి ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలోని మౌలిక వసతులను పరిశీలించి వెల్‌నెస్ సెంటర్ వద్ద సీసీ డ్రైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంపద కేంద్రంలో వర్మీ కంపోస్ట్ తయారీని పరిశీలించి ప్రశంసించారు. జాతీయ అవార్డుకు పరిశీలనలో ఉన్న ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించాలి'


