అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం పీసీబీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీని జేసీ శౌర్య మాన్ పటేల్ ప్రారంభించారు. అనంతరం చవితి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవోపీ విగ్రహాలకు బదులు మట్టి ప్రతిమలనే పూజించి జలవనరులను కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పర్యావరణ హితంగా వినాయక చవితి: జేసీ


