హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు ఉచిత డేటా ఎంట్రీ శిక్షణ

NTR: నందిగామ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాస్, ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. 10,12, డిగ్రీ విద్యార్హత కలిగిన 18 నుంచి 45 సంవత్సరాల నిరుద్యోగ యువతులు, మహిళలకు రెండు నెలల పాటు డేటా ఎంట్రీ కోర్సులో ఉచిత శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.