హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్ నమోదు

విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బి.సి కాలనీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ గూండాగిరి చేస్తున్న అల్లు సాగర్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ శుక్రవారం తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినా, తరచూ నేరాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.