PPM: కొత్త పెన్షన్ల దరఖాస్తుల గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించాలని సీపీఎం కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధ్రువీకరణ పత్రాలు అందడంలో జాప్యం, వరుస సెలవుల కారణంగా ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవడం అర్హులకు ఇబ్బందిగా మారిందన్నారు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు అవకాశం కల్పించేందుకు గడువు పెంచాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి'


