హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తాం: MRPS

KRNL: చట్నీహళ్లి గ్రామ స్మశాన వాటిక వివాదాన్ని పరిష్కరించాలని జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గర్జి హనుమన్న ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రాలయం PGRSలో జేసీ నూర్ ఖమర్కు వినతి ఇచ్చారు. ఏళ్లుగా వినతులు ఇస్తున్నా పరిష్కారం కావడం లేదని తెలిపారు. త్వరగా పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.