హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు హోం మంత్రి ఆదేశం

VSP: ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతమవ్వడంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం మంత్రి అనిత సూచించారు.