ELR: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి 64 పోలింగ్ బూతులపై మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకటరమణ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయా బూతుల్లో ఓటర్ల వివరాలను ఇప్పటికే అందుబాటులో ఉంచామన్నారు. జాబితాపై ఏవైనా మార్పులు, చేర్పులు,అభ్యంతరాలు ఉంటే నిబంధనల ప్రకారం వెంటనే తెలియజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రాజకీయ నాయకులతో కమిషనర్ భేటీ


