NTR: గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు తెలిపారు. ఇబ్రహింపట్నం మండలం గుంటుపల్లిలో రూ.45 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంటుపల్లిలోడ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన


