హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అందుకే నా కూతురును రాజకీయాల్లోకి తెచ్చా'

VZM: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 నెలల కిందటే చిన్న శ్రీను టీడీపీలో చేరతారని ఊహించానని అన్నారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని ఊరుకున్నానని చెప్పారు. అందుకే తన కుమార్తె అనూషను రాజకీయంగా ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక నుంచి చీపురుపల్లిలోనే ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని చెప్పారు.