హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్

NTR: జగ్గయ్యపేట మండలం వేదాద్రి రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బస్టాండ్ సమీపంలో గొర్రెల మందపైకి టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో 30 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 తీవ్రంగా గాయపడ్డాయి. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.