హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల సమస్యలపై తహశీల్దార్‌కు వినతిపత్రం

అన్నమయ్య జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పీలేరు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కరువు సహాయక చర్యలు, ఉచిత పశుగ్రాసం, ఉపాధి హామీ పనులు చేపట్టాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.