అన్నమయ్య: రాజంపేట (M) రోళ్లమడుగులో విషాద ఘటన చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్ బుర్రు నాగేశ్వర్‌రావు మృతిచెందారు. ఆయన అంత్యక్రియలకు తీసుకెళ్తున్న సమయంలో తల్లి వెంకట సుబ్బమ్మ (86) కుమారుడి మృతదేహం వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతిచెందారు. ఒకే రోజు తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఒకే రోజు తల్లి, కుమారుడు మృతి


