MNCL: పూజల పేరుతో జగిత్యాల జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలికతో లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. దీంతో సమాచారం అందుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లక్షెట్టిపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పూజల పేరుతో బాలికపై దురుసు ప్రవర్తన.. ఫిర్యాదు


