హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాము కాటుతో ఆవు మృతి.. పరిహారం కోసం రైతు వేడుకొలు

ASF: లింగాపూర్ మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన రైతు రాథోడ్ మీర్ సింగ్ ఆవు శుక్రవారం పాము కాటుతో మృతి చెందింది. గ్రామ శివారు ప్రాంతంలో ఉదయం మేతకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధిత రైతు తెలిపారు. పాము కాటు ప్రభావంతో ఆవు మృతి చెందడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని పరిహారం అందించాలని కోరారు.