హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. వేడి నీళ్లలో పడి చిన్నారి మృతి

HYD: నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేడి నీళ్ల బకెట్‌లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ చిన్నారి వేడినీళ్ల బకెట్‌లో పడినట్లు సమాచారం. చిన్నారి మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.