హైదరాబాద్: 28°C
తెలంగాణ

పద్మాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు

HNK: స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం శుక్రవారం అమావాస్య సందర్భంగా HNKలోని ప్రసిద్ధ శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేసి, అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.