హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వీక్లీ పరేడ్..

BDK: కొత్తగూడెం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏఆర్ డీఎస్పీ తెలిపారు.