HYD: గ్రేటర్‌లో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలో గరిష్ఠ విద్యుత్ నమోదైంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావానికి తోడు పగటి పూట 35 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉక్కపోతతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఈ సారి వానలు లేక, ఉక్కపోత, దోమల మోతతో ఈ కాలంలోనూ నిరంతరాయంగా ACలు పనిచేస్తున్నాయి. ఫలితంగా వర్షకాలంలో మొదటిసారి గరిష్ఠ డిమాండ్ 4వేల మెగావాట్ల మార్కును దాటింది.
తెలంగాణ
వర్షాకాలంలోనూ విద్యుత్‌కు డిమాండ్.!


