KMM: మధిర మండలం ఆత్కూర్ నుంచి పిల్లిగుట్ట వరకు జరుగుతున్న మెటల్ రోడ్డు పనులను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకుని నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కృషితో గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యం లభిస్తుందన్నారు.
తెలంగాణ
రహదారి పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు..


