హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవనిగడ్డలో రేపు జాతీయ లోక్‌ అదాలత్‌

కృష్ణా: అవనిగడ్డలో రేపు జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో కక్షిదారులు తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని అవనిగడ్డ ఆరవ అదనపు జిల్లా జడ్జి పాండురంగారెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు ఇరుపక్షాల సమ్మతితో కేసులు పరిష్కరించుకుంటే సమయం, ఖర్చు ఆదా అవుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.