హైదరాబాద్: 28°C
తెలంగాణ

24 గంటల విద్యుత్‌ ఇవ్వాలని రైతుల ధర్నా

SDPT: వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆయా గ్రామాల రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ సరఫరాలో కోతలు ఉండటంతో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.