SRCL: ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామంలో మద్య మానేరు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని రైతుల శుక్రవారం రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అధికారులు సాగునీరు విడుదల చేయడం లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కుడికాలువ నీటిని విడుదల చేయాలని రైతుల రాస్తారోకో


