KRNL: బొమ్మనపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వెంకటేశ్వర్లు కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, ఆసుపత్రికి వెళ్లి భౌతికదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటేశ్వర్లు మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని శ్రీదేవమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేత మృతికి మాజీ ఎమ్మెల్యే నివాళి


