హైదరాబాద్: 28°C
తెలంగాణ

వంతెనపై భద్రతకు దిక్కేది?

MBNR: పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ శివారులోని వాగుపై నిర్మించిన వంతెనకు ఇరువైపులా ఏర్పాటు చేసిన కాంక్రీటు రక్షణ కట్టడాలు కూలిపోయాయి. వాహనదారులు భయాందోళనల మధ్య ప్రయాణాలు సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం బీటీ రోడ్డు నిర్మించినప్పటికీ వంతెనకు మరమ్మతులు చేపట్టకపోవడంతో కంకర తేలి రహదారి ఆధ్వనంగా మారింది. రాత్రివేళ వాహనదారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వాగులో పడిపోయే ప్రమాదం ఉంది.