హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడుకు అరెస్ట్.. తండ్రి ఆత్మహత్యాయత్నం

WGL: మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్టు కావడంతో మనస్తాపానికి గురైన ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 40 నిద్రమాత్రలు మింగిన ఆయన శుక్రవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే వరంగల్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.