హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టు

JN: డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ పట్టణంలో ఆశా వర్కర్లను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్టు చేశారు. తమకు కనీస వేతనం రూ.18 వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.