ప్రకాశం: గిద్దలూరు మండలంలోని వెళ్లపల్లె, జయరామపురం, అంబవరం గ్రామాల్లో సీపీఎం నాయకులు ఆవులయ్య కరువు పర్యటన నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం వలన తీవ్రమైన వర్షాభావ పరిస్థితి, సరైన వర్షాలు లేక కంది, మిరప పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కంది పంటకు ఎకరానికి రూ. 10వేలకు పైగా ఖర్చవుతున్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు గిద్దలూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గిద్దలూరును కరవు మండలంగా ప్రకటించాలి'


